చిత్తూరు జిల్లా పుంగనూరు కట్టకింద రోడ్డు పనులు నిలిచిపోవడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కట్టకింద నివసిస్తున్న ఇళ్లపైకి, ప్రయాణించే వారిపైకి దుమ్ము పడకుండా కొంతమేర మాత్రమే తారు రోడ్డు వేసి, మిగిలిన భాగాన్ని అలాగే వదిలేశారు. ‘తారు రావడం లేదు’ అనే సాకుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కట్టపై నుండి కత్తార్లపల్లి వరకు ఉన్న రహదారి గుంతలమయమై, ప్రమాదకరంగా మారింది. నిత్యం ప్రమాదాలు జరుగుతూ, గాయాలపాలవుతున్నారని, ఈ మార్గంలో ప్రయాణించాలంటే భయాందోళనలకు గురవుతున్నారని, తక్షణమే సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు# కొత్తూరు మురళి.










