హార్టికల్చర్‌పై ప్రత్యేక దృష్టి.. బ్యాంకులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు.

0
3

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.5.11 లక్షల కోట్ల భారీ అంచనాతో నాబార్డు (NABARD) రుణ ప్రణాళికను ఆవిష్కరించారు.

గతేడాది కంటే 20 శాతం పెరిగిన ఈ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి రూ.2.55 లక్షలు, ఎంఎస్ఎంఈలకు రూ.1.64 లక్షల కోట్లు కేటాయించారు. ముఖ్యంగా హార్టికల్చర్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఏటా 450 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.

రాయలసీమ, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి రూ.5,313 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి బ్యాంకులు, నాబార్డు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.