ఘనంగా 90 వసంతాల ఆకాశవాణి వేడుకల నిర్వహణ

0
1

విజయవాడ ఆకాశవాణి కేంద్రం 90 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఆదేశాల మేరకు ఏడాది పొడవునా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘స్వర సంధ్య’ పేరిట సర్వేపల్లి సిస్టర్స్ గాత్ర కచేరీ, గరగ నృత్య ప్రదర్శనలు జరగనున్నాయి.

ఆకాశవాణి విశ్వసనీయతకు మారుపేరని, ఎం.బాలమురళీకృష్ణ, గొల్లపూడి వంటి దిగ్గజాలకు ఇది వేదికని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం 585 స్టేషన్లతో దేశవ్యాప్తంగా 92.5% ప్రజలకు చేరువవుతూ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలోనూ తన ఉనికిని చాటుకుంటోంది. మే 19న నగరంలో ప్రత్యేక వాకథాన్ నిర్వహించనున్నారు.