అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్న వ్యాపారవేత్తలకు ఉచితంగా గొడుగులు ఆదివారం పంపిణీ చేశారు.
ఎండలు, వర్షాల సమయంలో రోడ్లపై వ్యాపారం చేసే చిరు వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తకుండా సహాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు# కొత్తూరు మురళి.










