ఎమ్మిగనూరు MLA బివి జయ నాగేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో

0
4

డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరులోని మచాని సోమప్ప జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులను సన్మానించారు. 550కు పైగా, 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థినులకు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

ప్రభుత్వం అమలు చేసిన 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక వల్లే మంచి ఫలితాలు సాధించామని విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఆధునిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.