రైతులు నూతన పద్ధతులను పాటించాలి- వ్యవసాయ శాస్త్రవేత్తలు

0
8

సూర్యాపేట జిల్లా, చిలుకూరు మండలం, బేతవోలు గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ పి. రాజనీకాంత్, డాక్టర్ ఎస్. శ్రీనివాస్ నేతృత్వంలో ‘రైతు ముంగింట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం జరిగింది.

వానాకాలం సీజన్‌కు ముందు రైతులు విత్తన రకాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరియు రసాయన ఎరువుల (ముఖ్యంగా యూరియా) మితిమీరిన వాడకం వల్ల నేల సారం తగ్గిపోతుందని, దీనివల్ల కలిగే అనర్థాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. రసాయన పిచికారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నూతన వరి వంగడాలు, సేంద్రియ వ్యవసాయం, పంట మార్పిడిపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీధర్ మరియు నీటిని పొదుపుగా వాడుకుంటూ, పంటల సాగును ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు చంద్ర శేఖర్, శిరీష, వసీమ మరియు రైతులు పాల్గొని శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చించారు.