వరంగల్: వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి
భారత్ అవాజ్ న్యూస్: 13 మే నేడువరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన వ్యవసాయ కూలీ వడదెబ్బతో మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. సోమవారం పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన కొండేటి మల్లయ్య (47) తీవ్ర ఎండవేడిమికి అస్వస్థతకు గురయ్యాడు.
గమనించిన సహకూలీలు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. ఇటీవల పెరుగుతున్న ఎండల తీవ్రతతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు….. ప్రభుత్వ ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నా…. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము









