హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ కేసరి–2026 కుస్తీ పోటీల విజేతలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి G. Vivek Venkataswamy ఘనంగా సన్మానించారు. మాజీ ఎంపీ Anjan Kumar Yadav ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ పోటీల విజేతలను ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అభినందించారు.
“హైదరాబాద్ కా పైచాన్ అంటే హైదరాబాద్ కా పెహల్వాన్” అని మంత్రి పేర్కొంటూ, నగరానికి కుస్తీ క్రీడలతో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. యువతలో క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంచుతాయని చెప్పారు. విజేతలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.










