“ప్రజల ఓట్లు ఏపీలో.. పవర్ మీటింగ్స్ హైదరాబాద్‌లో?”

0
7

రాష్ట్ర విభజన తర్వాత “మనకంటూ ఒక రాజధాని” అని కలలు కన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు.. ఇప్పటికీ కనిపిస్తున్నది మాత్రం హైదరాబాద్ నీడే. ప్రధాని మీటింగ్ కూడా అమరావతి కాదు.. విజయవాడ కాదు.. హైదరాబాద్‌లో జరగడం ఇప్పుడు భారీ రాజకీయ చర్చకు దారితీసింది.

ఏపీని పాలించే నేతలు.. నిర్ణయాల కోసం ఇంకా పక్క రాష్ట్రం వైపు చూడాల్సి వస్తే.. ప్రత్యేక రాష్ట్రం వల్ల సాధించింది ఏమిటి అనే ప్రశ్న వినిపిస్తోంది. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు కేవలం ఎలక్షన్ స్పీచులకే పరిమితమయ్యాయా?

“ఏపీ ఆత్మగౌరవం” అనే మాట స్టేజ్‌ల మీద మాత్రమేనా..? లేక నిజంగా ఈ రాష్ట్రానికి సొంత రాజకీయ గుర్తింపు వస్తుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.