నిజామాబాద్

0
4

నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు ఇటీవలే ఆర్యవైశ్య పెద్దలు, ప్రముఖ రైస్ మిల్ వ్యాపారి కోల రాములు గారు పరమపదించిన సందర్భంగా వారి నివాసానికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సందర్భంగా గణేష్ బిగాల గారు మాట్లాడుతూ కోల రాములు గారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గొప్ప వ్యక్తి అని, వ్యాపార రంగంలోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా విశేషంగా సేవలందించారని పేర్కొన్నారు. వారి మరణం కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా ఆర్యవైశ్య సమాజానికి తీరని లోటని అన్నారు. అలాగే వారికి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.