బండి సంజయ్ ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి, గల్లీలో కార్పొరేటర్‌గా, ఆపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పార్టీని పరుగులు పెట్టించి,
ఈ రోజు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారంటే దాని వెనుక ఎన్నో ఏళ్ల పోరాటం, చెమట, కష్టం ఉందన్నది ఆ పార్టీ కార్యకర్తల మాట. లక్షల మంది కాషాయ కార్యకర్తల నమ్మకం ఆయన ఎదుగుదల.
కానీ, కొడుకు చేసిన తప్పుడు తిరుగుడు ఈ రోజు
ఆ తండ్రి పరువును బజారున పడేసింది.
రాజకీయాల్లో ఉన్న తండ్రులు గెలిచే ప్రతి యుద్ధం వెనుక ఒక ఆశ ఉంటుంది, కానీ ఇలా ‘సన్ స్ట్రోక్’ తో సొంత ఇంట్లోనే ఓడిపోతారని ఎవరూ ఊహించరు
మీరు మీ తండ్రికి రాజకీయ వారసులుగా ఎదగక పోయిన పర్లేదు, కానీ వారి ఏళ్ల తరపడి కష్టించి ఒక్కో మెట్టు ఎక్కి రక్తం ధారపోసి సంపాదించుకున్న గౌరవాన్ని మాత్రం రోడ్డు పాలు చేయకండి..
మీరు చేసే ఒక్క తప్పు, మీ తండ్రి ఇన్నేళ్లుగా కట్టుకున్న సామ్రాజ్యాన్ని కుప్పకూల్చుతుంది. కూల్చిన దాఖలాలు కోకొల్లలు. సంజయ్ విషయంలోను అదే జరిగింది. కేవలం ఒక తండ్రి పరువు పోవడం కాదు.. ఒక సామాన్యుడి నుండి ఒక ఉన్నత స్థానం వరకు ఎదిగిన బండిలాంటి పొలిటికల్ లీడర్ కెరీర్‌కు కొడుకులే స్వయంగా విలన్ అవ్వడం. భగీరథ లాంటి కొడుకులతో నామరూపాలు లేకుండా పోయే సంజయ్ లాంటి నేతలెందరో. తప్పునుతప్పు అని సమర్దించని సమాజంలో బలైపోయే బాదితులు ఎందరో. ముందు ఇళ్లు చక్కదిద్దుకుందాం.. ఆ తర్వాతే సమాజం. కాదంటే అదఃపాతాలమే.










