హామీలు అమలు చేయాలి.. దీక్షలు ఆగాలి.|

0
5

● అల్వాల్ జేఏసీ చైర్మన్ పటోళ్ల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు

● ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్

అల్వాల్, సెప్టెంబర్ 30: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ అల్వాల్ సర్కిల్ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 14వ రోజుకు చేరుకున్నాయి. 

జేఏసీ చైర్మన్ పటోళ్ల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దీక్షలు కొనసాగుతున్నాయి.

బుధవారం నిర్వహించిన దీక్షలో బి. వెంకట రాజు, పి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పటోళ్ల సురేందర్ రెడ్డి, పుట్నాల కృష్ణ, ముత్యాలు, అనంతుల సంతోష్, శేరుపల్లి మల్లేష్, రమేష్, శ్రీనివాస్ చారి, ధనంజయ్ రెడ్డి తదితరులు పాల్గొని దీక్ష చేస్తున్న ఉద్యమకారులకు సంఘీభావం తెలిపారు.

తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

#Sidhumaroju

Alwal