కన్హా హాస్పిటల్ ప్రారంభం.. ప్రజలకు మరింత చేరువగా వైద్యం.|

0
10

● మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు చేతుల మీదుగా ప్రారంభం

● ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావాలి: ఎమ్మెల్యే

అల్వాల్, సెప్టెంబర్ 30: హైదరాబాద్ అల్వాల్‌లోని పంచశీల ఎంప్లాయీస్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కన్హా హాస్పిటల్‌ను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు సులభంగా అందుబాటులో ఉండటం ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

ఆధునిక వైద్య సదుపాయాలతో పాటు నిపుణులైన వైద్యుల సేవలు ప్రజలకు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

కన్హా హాస్పిటల్ ప్రారంభంతో అల్వాల్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అవసరమైన వైద్య సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని ఆయన ఆకాంక్షించారు. 

ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు.

ఆసుపత్రి నిర్వాహకులు, వైద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానికులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal