దిల్ కుష్ నగర్ లో టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ పాదయాత్ర

0
2

బాలనగర్ దిల్ కుష్ నగర్‌లో బండి రమేష్ పాదయాత్ర

కూకట్‌పల్లి: కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ఆదివారం బాలనగర్ డివిజన్ దిల్ కుష్ నగర్‌లో విస్తృత పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఐడీపీఎల్ స్థలం రహదారికి అడ్డంగా వేసిన ఫెన్సింగ్‌ను తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని.

రోడ్లపై పొంగిపొర్లుతున్న మురుగునీటి సమస్య నివారణకు కొత్త డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే అసాంఘిక శక్తుల ఆగడాలను అరికట్టేందుకు నైట్ పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన బండి రమేష్.. అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, పుష్ప రెడ్డి తదితరులు పాల్గొన్నారు.