రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా, మైలారం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు వరి, మక్క, పత్తి, కూరగాయల సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు పరిచయం చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
ప్రస్తుత వాతావరణానికి అనుగుణంగా పంటల పరిరక్షణ, నీటి సమర్థ వినియోగం, యంత్రాల వాడకంపై అధికారులు అవగాహన కల్పించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, ప్రకృతిని కాపాడే సేంద్రీయ ఎరువులను వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, సర్పంచ్, స్థానిక రైతులు పాల్గొన్నారు.










