వైసీపీ రైతు విభాగం ప్రతినిధి గడ్డం నారాయణరెడ్డి

0
5

ఆంజనేయ స్వామి ఆలయ భూమి వివాదం: కమిషనర్ వైఖరిపై వైసీపీ నేత గడ్డం నారాయణరెడ్డి ధ్వజమెత్తారు

ఎమ్మిగనూరులోని ‘కోతుల బావి’ ఆంజనేయ స్వామి ఆలయ భూమి వివాదానికి మున్సిపల్ కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలే కారణమని వైసీపీ రాష్ట్ర రైతు విభాగం అధికార ప్రతినిధి గడ్డం నారాయణ రెడ్డి మండిపడ్డారు. కమిషనర్ తన స్వార్థ ప్రయోజనాల కోసం పట్టణంలో ఉద్రిక్తతలు రేపుతున్నారని, అక్రమ అంగళ్లను వదిలేసి కేవలం దేవాలయ స్థలాన్నే లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

గుడి స్థలాన్ని కాపాడాలని శాంతియుతంగా కోరుతున్న భక్తులను 300 మంది పోలీసులతో అక్రమంగా అరెస్టులు చేయించడం దుర్మార్గమన్నారు. ఇది హిందువుల మనోభావాలకు సంబంధించిన సమస్య అని, స్థానిక ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి వెంటనే స్పందించి కమిషనర్ మొండివైఖరికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.