“మైనంపల్లి ఆదేశాలతో గ్రౌండ్‌లోకి కాంగ్రెస్ నాయకులు”

0
45

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు టెంపుల్ అల్వాల్ డివిజన్ రాజీవ్ వీకర్ సెక్షన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి కార్యక్రమాలు నిర్వహించారు.

SIR ఎన్నికల ఓటర్ లిస్ట్ పరిశీలన కార్యక్రమాన్ని బీఎల్ఏ జ్యోతి యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టగా, స్థానిక ప్రజా సమస్యలపై నేతలు ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ సందర్భంగా వీకర్ సెక్షన్‌లో కొనసాగుతున్న యూజీడీ పనుల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు.

ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి నియోజకవర్గ ఇంచార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి, ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేబుల్ శేఖర్, 192 డివిజన్ అధ్యక్షుడు ఎన్ అశోక్ రెడ్డి, 193 డివిజన్ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్, ఉదయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు కృష్ణ గౌడ్, నాగేశ్వరరావు, వెంకటేష్ గౌడ్, ఎం.కే నరేష్, విష్ణు, మహిళా నాయకులు నిర్మల రాజ్, నీత, శీలా, అనంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, ప్రతి కాలనీలో ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని నాయకులు తెలిపారు.

#Sidhumaroju

Alwal