ఈనెల 18 న నిర్వహించునున్న ప్రత్యేక లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారానికి సహకరించాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జ్ నిర్మల కోరారు.. బుధవారం మంచిర్యాల్ జిల్లాలోని ప్రధాన న్యాయస్థానంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్ లో ఎస్ ఐ యాక్ట్ , ఇతర కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జిలు కవిత, కృష్ణ తేజ పాల్గొన్నారు..









