నారా లోకేష్ నేతృత్వంలోని కమిటీకి చంద్రబాబు దిశానిర్దేశం.

0
7

పారిశ్రామిక ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలో కుదిరిన పారిశ్రామిక ఒప్పందాలు కాగితాలకే పరిమితం కాకుండా, వెంటనే క్షేత్రస్థాయిలో ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని కమిటీకి ఆయన దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ద్వారా రూ.11.47 లక్షల కోట్ల విలువైన 282 ప్రాజెక్టులకు ఆమోదం తెలపగా, అందులో 114 ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని అధికారులు వెల్లడించారు. మిగిలిన ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు, భూ కేటాయింపుల ప్రక్రియను వేగవంతం చేసి, త్వరగా పనులు మొదలయ్యేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు