‘స్త్రీ శక్తి’ థీమ్‌తో ‘మహానాడు-2026’… పండుగలా జరపాలన్న చంద్రబాబు.

0
3

‘స్త్రీ శక్తి’ థీమ్‌తో ‘మహానాడు-2026’

ఈ ఏడాది టీడీపీ మహానాడును ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో, మే 27, 28 తేదీల్లో హైబ్రిడ్ విధానంలో పండుగలా నిర్వహించాలని పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో మొత్తం 20 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ఇందులో ఏపీకి 10, తెలంగాణకు 4, అండమాన్‌కు 1, అలాగే 4 ఉమ్మడి, 1 రాజకీయ తీర్మానం ఉన్నాయి.

మహిళా సాధికారతకు టీడీపీ కట్టుబడి ఉందని, ప్రభుత్వ పథకాల్లో వారి భాగస్వామ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి, ఇంధన పొదుపు చర్యలతో పాటు ప్రతిపక్ష కుట్రలపై చర్చించాలన్నారు. ప్రతి ఇంటిపై జెండా ఎగరేసి, ఎన్టీఆర్ విగ్రహాల సాక్షిగా మహానాడును విజయవంతం చేయాలని శ్రేణులను ఆదేశించారు.