జగన్‌పై మంత్రి నాదెండ్ల ఫైర్.. అన్ని విమర్శలకు ఘాటు కౌంటర్.

0
1

జగన్‌పై మంత్రి నాదెండ్ల ఫైర్

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీపం పథకం కింద 48 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పారదర్శకంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని స్పష్టం చేశారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం ఇస్తున్నామని, దమ్ముంటే జగన్ వచ్చి పరిశీలించాలని సవాల్ విసిరారు.

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రయాణాలపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఐదేళ్ల పాలనలో స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్ల కోసం రూ. 222 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన ఘనత జగన్‌దేనని ఎద్దేవా చేశారు. అమరావతి రాజధాని రైతుల త్యాగాలను విస్మరించి మాట్లాడటం జగన్ అహంకారానికి నిదర్శనమని నాదెండ్ల మనోహర్ ఖండించారు.