ఆసిఫాబాద్‌లో సీఎం పర్యటన: ఎస్పీ నితికా పంత్ కీలక ఆదేశాలు!

0
7

🎤కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్:

ఆసిఫాబాద్:  ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 2:00 గంటల నుండి కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్, కెరమెరి పరిసర ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ నితికా పంత్ భారీ ఆంక్షలు మరియు ట్రాఫిక్ నిబంధనలను జారీ చేశారు. అధికారిక రూట్ మ్యాప్ ప్రకారం, ప్రజల సౌకర్యార్థం భారీ పార్కింగ్ స్థలాలను కేటాయించారు. దీని ప్రకారం, ఆసిఫాబాద్ రూట్ నుండి వచ్చే వాహనాల (బస్సులు, వ్యాన్‌ల) కోసం అత్యధికంగా 27 ఎకరాల పార్కింగ్ స్థలాన్ని, మంచిర్యాల రూట్ నుండి వచ్చేవారి కోసం ఇందిరానగర్ దాటిన తర్వాత 12 ఎకరాల పార్కింగ్ స్థలాన్ని (అదనపు పార్కింగ్‌తో కలిపి), మరియు కాగజ్‌నగర్ రూట్ నుండి వచ్చేవారి కోసం కన్యకా కాటన్ మిల్లు సమీపంలో 8 ఎకరాల పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలందరూ ఎవరికి కేటాయించిన స్థలాల్లోనే వాహనాలను నిలపాలని.

సీఎం పర్యటన ముగిసేవరకు రోడ్లపై ఎలాంటి వాహనాలను నిలపరాదని, పశువులను రోడ్లపైకి అనుమతించవద్దని స్పష్టం చేశారు. అలాగే సోమవారం మధ్యాహ్నం 2:00 గంటల నుండి కెరమెరి – ఆసిఫాబాద్ ఇరువైపులా, అలాగే కాగజ్‌నగర్ – ఎక్స్ రోడ్ వద్ద 2 ఎకరాల్లో ప్రత్యేక వేదిక (డైస్) పార్కింగ్, విఐపి మరియు జనరల్ గ్యాలరీలను ఏర్పాటు చేశామని, అత్యవసరాల కోసం టోవింగ్ వాహనాలను సిద్ధంగా ఉంచామని తెలుపుతూ, ప్రజలందరూ పోలీసులకు సహకరించి పర్యటనను విజయవంతం చేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.