వేటపాలెం పోలీస్ స్టేషన్ కి వాటర్ కూలింగ్ రిఫ్రిజిరేటర్ బహుకరణ

0
7

*చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుశారం వేటపాలెం పోలీస్ స్టేషన్లో సమస్యల మీద పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు వేసవి దృష్ట్యా కూలింగ్ వాటర్ అందాలని ఉద్దేశంతో బాపట్ల జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు – చీరల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దోగిపర్తి బాలకృష్ణ కూలింగ్ రిఫ్రిజిరేటర్ ని బహూకరణ చేశారు.దీనిని వేటపాలెం స్టేషన్ ఆఫీసురైన పి జనార్ధన్ ప్రారంభించారు.

ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు జాగబత్తుని పోతురాజు, వైశ్య ఫెడరేషన్ సభ్యులు కొత్త శ్రీనివాసరావు, చుండూరు సురేష్, మాజేటి వెంకట సుబ్బారావు, గట్టా రమేష్, చుండూరు నాగాంజనేయులు, శేఖర్ మరియు గ్రామ ప్రజలు స్టేషన్ సిబ్బంది పాల్గొనడం జరిగింది