గొడ్డలి పార్టీకి విధ్వంసం తప్ప ఏమీ చేతకాదు: సీఎం చంద్రబాబు ఫైర్.

0
4

అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎస్సీ నియామకాలు అత్యంత పారదర్శకంగా, కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే జరిగాయని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ‘పేటిఎం బ్యాచ్‌ల’తో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి రూ.10 కోట్ల నిధుల కేటాయింపుపై వస్తున్న విమర్శలను ఆయన తప్పుబట్టారు.

ప్రతిపక్షానికి విమర్శలు, విధ్వంసం తప్ప మరేమీ చేతకాదని, వారిని ‘గొడ్డలి పార్టీ’గా అభివర్ణించారు. అనవసర వివాదాలు పక్కనబెట్టి, ప్రజలకు మంచి చేయడంలో రాజకీయ పార్టీలు పోటీ పడాలని, ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయలేని వారిని ప్రజలే బహిష్కరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.