ఇతను కాక ఇంకెవరు తెలంగాణ జాతిపిత…..?

0
0

ఆగిన తొలిదశ ఉద్యమాన్ని ఆకాశానికి అంటేలా తట్టి లేపి అలుపెరుగకుండా 14 ఏళ్ళు తెలంగాణలోని ప్రతీ ఊరువాడని ఏకం చేస్తూ గమ్యాన్ని ముద్దాడేలా చేసిన ఇతను కాక ఇంకెవరు తెలంగాణ జాతిపిత…? 

‎అతని పోరాట వ్యూహాలని దేశంలోని 32 పార్టీలు అంగీకరించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సరియైనదేనని మద్దతు పలికేలా చేసిన కేసీఆర్ కాకపోతే ఇంకెవరు జాతిపిత…? 60 ఏళ్లుగా సాకరం కానీ కలని కేవలం 14 ఏళ్లలో కళ్ళముందు ఆవిష్కరించిన అతని రాజకీయ వ్యూహాలు, అతని పోరాట వేడి తెలిసిన వాళ్ళు అతను కాక ఇంకెవరు తెలంగాణ జాతిపిత అంటారు. 

ఉద్యమం నుండి స్వరాష్ట్ర సాధన వరకు ఆయన ప్రతీ అడుగులో తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ నిర్మాణమే ఊపిరిగా బ్రతికిన మనిషిని కాదని ఇంకెవరిని అంటాం జాతిపిత… తెలంగాణ సమాజమే ముక్తకంఠంతో కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని నినదిస్తుంటే తెలంగాణకి మరో జాతిపిత ఎవరుంటారు ఆయన కాకా. 4 కోట్ల మందికి స్వేచ్ఛ, స్వాతంత్య్ర్యాలు ప్రసాదించి దశాబ్దాల దరిద్రాన్ని పారదోలి, 10 ఏళ్ళ పాలనలో దేశం తెలంగాణ వైపు తిరిగి చూసేలా పాలించిన తొలి ముఖ్యమంత్రే మా తెలంగాణ జాతిపిత