పుంగనూరు హైవే పై ఎంవీఐ సుప్రియ తనిఖీలు

0
0

ముంబై-చెన్నై హైవేలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ వాహనాలను బుధవారం తనిఖీ చేశారు. అన్నమయ్య జిల్లా, పుంగనూరులో ఓవర్ లోడ్, సరైన రికార్డులు లేని వాహనాలను సీజ్ చేశారు. పర్మిట్, ఫిట్నెస్, పొల్యూషన్, లైసెన్స్ తప్పనిసరి అని, పరిమితికి మించి వాహనాలు నడపరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు# కొత్తూరు మురళి .