విద్యుత్ చార్జీలపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి గొట్టిపాటి.

0
2

మూడేళ్ల వరకు విద్యుత్ ఛార్జీలు పెంచం: మంత్రి గొట్టిపాటి

గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ రంగంలో సృష్టించిన విధ్వంసాన్ని సరిదిద్ది, వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే మూడేళ్లలో కూడా విద్యుత్ ఛార్జీలను పెంచబోమని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ ‘ట్రూ అప్’ భారాన్ని తొలగించి, చరిత్రలోనే తొలిసారి ‘ట్రూ డౌన్’ విధానం ద్వారా యూనిట్‌కు 13 పైసలు తగ్గించామని వెల్లడించారు. సూర్యఘర్ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు 6 లక్షల ఉచిత సోలార్ కనెక్షన్లు ఇస్తామని, పునరుత్పాదక ఇంధన రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ సాధనే లక్ష్యమని పేర్కొన్నారు.