రోడ్లు శుభ్రంగా ఉండాలి: బొబ్బిలి కమిషనర్|

0
1

బొబ్బిలి పట్టణంలో మురుగునీటి కాలువల పూడికలు తీసి శుభ్రం చేయాలని మున్సిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి ఆదేశించారు. గురువారం ఆమె ఆరిగంగయ్య కాంప్లెక్స్, దిబ్బవీధి, కొత్తఎరుకులవీధి ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా కాలువల నుంచి వ్యర్థాలను త్వరితగతిన తొలగించాలని, రోడ్లను నిరంతరం శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచనలు చేశారు.

#Boiena Rajesh