ఈరోజు మార్కాపురం మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం- సంక్షేమం అభివృద్ధి” విజయోత్సవ సభలో జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూకబ్జాలు, ఆన్‌లైన్ అక్రమాల వల్ల వెనుకబడిన మార్కాపురాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నాం.
ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి గారు మార్కాపురం జిల్లాను ప్రకటించి మన ప్రాంత ప్రజల చిరకాల కాంక్షను నెరవేర్చారు.
జూలై చివరి నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ₹905 కోట్లు కేటాయించి, పనులు వేగవంతం చేశాం.
మన ప్రాంతంలో కొత్త పరిశ్రమల స్థాపన, విమానాశ్రయ ఏర్పాటు మరియు శ్రీశైలం ఘాట్ రోడ్డును 4 లేన్ల కారిడార్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
కులమతాలకతీతంగా సంక్షేమ ఫలాలను అందిస్తూ, మార్కాపురాన్ని మోడల్ జిల్లాగా తీర్చిదిద్దడమే మన










