మదనపల్లె పట్టణంలోని నిమ్మనపల్లె సర్కిల్లో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా శుక్రవారం ఆవిష్కరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అధ్యక్షుడు నాదెళ్ల రమేష్, టీడీపీ నాయకులు ఆర్జె వెంకటేష్, ఎస్ఎల్వి రఘు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఆదర్శప్రాయమన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని తెలిపారు








