ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం|

0
2

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి మండలం కింతలివానిపేటలో  ఇంటింటికి టీడీపీ నిర్వహించారు. గ్రామంలో తాగునీరు కోసం ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు అనగా ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులతో మాట్లాడి ప్రజలకు సురక్షితమైన తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధిని వివరించారు.

#Rajesh