చింతూరు బైక్ మెకానిక్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అధ్యక్షుడిగా మొహమ్మద్ ఫయాజ్, కార్యదర్శిగా షేక్ సౌకత్, కోశాధికారిగా (ట్రెజరర్) నందిగామ సురేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను యూనియన్ సభ్యులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మొహమ్మద్ ఫయాజ్ మాట్లాడుతూ, బైక్ మెకానిక్‌ల సంక్షేమం, వృత్తి అభివృద్ధి, సభ్యుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ తరఫున సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. కార్యదర్శి షేక్ సౌకత్ మాట్లాడుతూ సభ్యులందరి సహకారంతో యూనియన్‌ను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ట్రెజరర్ నందిగామ సురేంద్ర యూనియన్ ఆర్థిక వ్యవహారాలను పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతూరు బైక్ మెకానిక్ యూనియన్ సభ్యులు పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలియజేశారు.
# Yadagiri










