ఆగస్టు నెలకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని JC సేధు మాధవన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో రీ-సర్వే, జీవో 444 అమలు, రెవెన్యూ వన్, పీజీఆర్ఎస్ వినతుల పురోగతిని సమీక్షించారు. పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. అందరి సమష్టి కృషి ఫలితంగానే విమానాశ్రయ ప్రారంభోత్సవం విజయవంతమైందన్నారు.
#Rajesh










