యర్రగొండపాలెం అంగన్వాడీలో ఎరిక్షన్ బాబు పారిశుధ్య సమీక్ష|

0
0

స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా యర్రగొండపాలెం పట్టణంలోని ఉట్ల స్థంబాల వీధిలోని అంగన్వాడీ కేంద్రంలో వ్యక్తిగత, పారిశుధ్య పరిస్థితిపై యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు సమీక్షించారు. ఈ సందర్బంగా చిన్నారుల మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత పరిశీలించారు. అనంతరం చిన్నారులతో ముచ్చటించారు. చిన్నారులకు అందజేస్తున్న పోషకాహారం గురించి అంగన్వాడీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్వయంగా చిన్నారులకు అల్పాహారం వడ్డించారు. కార్యక్రమంలో సీడీపీఓ గారు, ఎంపీడీఓ గారు, AMC చైర్మన్ చేకూరి సుబ్బారావు గారు, మండల టీడీపీ అధ్యక్షులు చిట్యాల వెంగళరెడ్డి గారు, పోట్ల గోవిందు గారు అంగన్వాడీ సిబ్బంది, టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు…