నంద్యాల జిల్లా కొత్తపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి చిన్నారులతో గడిపాను. పిల్లలతో సరదాగా మాట్లాడి, వారికి అందిస్తున్న పోషకాహారం గురించి తెలుసుకున్నాను.
అనంతరం చిన్నారులతో కలిసి భోజనం చేసి, ఆహారం నాణ్యత, పరిశుభ్రత, మెనూ అమలు తీరును పరిశీలించాను. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన పోషకాహారం, ఆరోగ్యకరమైన వాతావరణం అందేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని ఈ సందర్భంగా పేర్కొన్నాను.
ఈ కార్యక్రమంలో MPDO శ్రీమతి ఎస్. సుగుణశ్రీ గారు, DEO శ్రీ జనార్ధన్ రెడ్డి గారు, PD ICDS శ్రీమతి లీలావతి గారు, CDPO శ్రీమతి చంద్రకళ గారు, మార్క్ఫెడ్ డైరెక్టర్ శ్రీ టి. తులసిరెడ్డి గారు, FCI డైరెక్టర్ శ్రీ ఎన్. విశ్వనాథ రెడ్డి గారు, శ్రీ టి. నాగేశ్వరరెడ్డి గారు, మాజీ సర్పంచ్ శ్రీ టి. నారాయణ గారు, అంగన్వాడీ సిబ్బంది, సబ్ సెంటర్ ఆరోగ్య సిబ్బంది మరియు రెండు సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.










