త్రిపురాంతకం మండలం నడిగడ్డ గ్రామంలో అన్నదాత సుఖీభవ – PM కిసాన్ (రైతన్న మీకోసం) 2026-27 సంవత్సర మొదటి విడత పంపిణి కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా LED స్క్రీన్ పై PM నరేంద్ర మోడీ గారు, CM చంద్రబాబు గారి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. అనంతరం అన్నదాత సుఖీభవ చెక్కులను యర్రగొండపాలెం నియోజకవర్గంలో 39,274 మంది రైతులకు 25 కోట్ల 96 లక్షల రూపాయలను విడుదల చేశారు. ఈ సందర్బంగా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో AMC చైర్మన్ చేకూరి సుబ్బారావు గారు, మండల అధ్యక్షులు మేకల వలరాజు గారు, చిట్యాల వెంగళరెడ్డి గారు, పోట్ల గోవిందు గారు, షేక్ మాబు గారు, వ్యవసాయ శాఖ అధికారులు, టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు…










