ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు భద్రత ప్రణాళిక పటిష్ట బందోబస్తు|

0
2

ఈ నెల 27న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లా, గిద్దలూరు మండలంలోని క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో ‘సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్’ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఇతర అధికారులతో కలిసి ముందస్తు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇందులో భాగంగా హెలిప్యాడ్, సీఎం కాన్వాయ్ రూట్, సభా ప్రాంగణాలను పరిశీలించారు.

పర్యటనలో ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా వాహనాలకు వేర్వేరు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.