పుంగనూరు పట్టణంలోని నానాసాహెబ్పేటకు చెందిన బాబా కుమారుడు అహ్మద్ భాషా (46) ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత ఆదివారం నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు ఇళ్లల్లో పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో బుధవారం పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ వాసు తెలిపారు. అహ్మద్ భాషా ఆచూకీ తెలిసినచో పోలీసులకు సమాచారం అందించాలని కోరారు# కొత్తూరు మురళి .









