ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోయాయి: కిరణ్ కుమార్ రెడ్డి.|

0
0

 

ప్రస్తుత రాజకీయాలు విధాన పరమైన చర్చలను పక్కనబెట్టి వ్యక్తిగత విమర్శలు, దూషణల స్థాయికి పూర్తిగా దిగజారిపోయాయని ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లులో ఆయన మాట్లాడుతూ.. ఇతర వృత్తుల్లో ఉన్నవారు పరస్పరం గౌరవించుకుంటుంటే, రాజకీయ నాయకులు మాత్రం ఒకరినొకరు కించపరుచుకుంటున్నారని విమర్శించారు.

నేటి టీవీ డిబేట్లను కుటుంబంతో కలిసి చూసే పరిస్థితి ఏమాత్రం లేదని, అందులో వాడే అసభ్యకరమైన భాషపై విరక్తి కలుగుతోందని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ సంస్కృతి కూడా మంచిది కాదని హితవు పలికారు. నాయకులు వ్యక్తిగత అజెండాలు వీడి, ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలపై మాత్రమే దృష్టి సారించాలని స్పష్టం చేశారు.