జనకపూర్‌లో ఎస్‌ఐఆర్ సర్వేపై అధికారుల క్షేత్రస్థాయి తనిఖీ|

0
0

కొమురం భీం ఆసిఫాబాద్ న్యూస్ ప్రతినిధి జగదీష్

ఆసిఫాబాద్: తెలంగాణ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన Special Intensive Revision (SIR) – ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జనకపూర్ 1వ వార్డులో కొనసాగుతున్న ఇంటింటి సర్వే ప్రక్రియను అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, మరియు మున్సిపల్ చైర్మన్ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డు పరిధిలో బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLO) సేకరిస్తున్న ఓటర్ల వివరాల రికార్డులను మరియు ఎన్యూమరేషన్ ఫారాలను స్వయంగా పరిశీలించిన అడిషనల్ కలెక్టర్, 1వ వార్డు ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా ఈ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ వినోద్, వార్డు ఆఫీసర్ రామయ్య మరియు పెద్ద సంఖ్యలో 1వ వార్డు స్థానిక గ్రామస్థులు పాల్గొని అధికారుల బృందానికి పూర్తి స్థాయిలో సహకరించారు.