“సెమీకండక్టర్ రంగంలో యువతకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించే దిశగా ముందడుగు”
మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 4: భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యానికి మరో కీలక అడుగు పడింది. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రముఖ వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్ శిక్షణా సంస్థ మేవెన్ సిలికాన్ అత్యాధునిక ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 17 ఏళ్లుగా బెంగళూరులో సెమీకండక్టర్ రంగానికి నాణ్యమైన ఇంజనీర్లను అందిస్తున్న మేవెన్ సిలికాన్ హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఈ కేంద్రం ద్వారా స్థానిక ఇంజనీరింగ్ విద్యార్థులు, యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) ద్వారా దేశంలో చిప్ డిజైన్, తయారీ రంగాల అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తోందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
సెమీకండక్టర్ రంగంలో దేశీయ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి శిక్షణా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని, భారత యువతను ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దడంలో మేవెన్ సిలికాన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని ఆయన అన్నారు.
#Sidhumaroju
Alwal










