భారత్ ఆవాజ్ ప్రతినిధి గోయిండ్ల ప్రశాంత్ : హనుమకొండలో ప్రముఖ వైద్యుడిని బెదిరించి 15 కోట్ల రూపాయలు వసూలు చేయాలని కుట్రపనిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు సాంకేతిక ఆధారాలు నిఘా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.
గతంలో ప్రముఖ వైద్యుడు వద్ద డ్రైవర్గా పని చేసిన ఈ అమ్మ గోని సుభాష్ గౌడ్ ఉద్యోగం కోల్పోయిన కక్షతో డాక్టర్ను బెదిరించి డబ్బులు వసూలు చేయాలనే పథకం వేశాడు. ఇందుకు తన స్నేహితులు శ్రీ మూర్తి శ్రీనివాస్ బానోతు రావు రమేష్ లను కలుపుకున్నాడు .
డాక్టర్ కుటుంబం కదలికలకు సంబంధించిన సమాచారంతో భానుతు రమేష్న్ ఫోన్ చేసి 15 కోట్ల సుపారి వచ్చిందని, తనను చంపవద్దంటే కోటి రూపాయలు ఇవ్వాలని డబ్బులు ఇవ్వకపోతే హత్య చేస్తామని బెదిరించాడు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు కాల్ డేటా సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించారు. మరోసారి ఆసుపత్రి వద్ద రిక్కీ నిర్వహించేందుకు ములుగు క్రాస్ రోడ్డు వద్ద వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.










