“రాంనగర్, జే.జే.నగర్‌లో పర్యటన.. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయిస్తామని హామీ”
మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 8: ఆల్వాల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి బుధవారం రాంనగర్, జే.జే.నగర్ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆమె స్వయంగా తెలుసుకున్నారు.
పార్కు అభివృద్ధి పనులు పూర్తికాకపోవడం, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాన్ని మార్చాల్సిన అవసరం, మురుగు కాలువలు మూసుకుపోవడం, చెట్ల కొమ్మలు ప్రమాదకరంగా విస్తరించడం వంటి సమస్యలను స్థానికులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజల నుంచి వచ్చిన వినతులను శ్రద్ధగా విన్న శాంతి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారుల దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు.
#Sidhumaroju
Alwal










