హైదరాబాద్ కుకట్‌పల్లిలోని గోపాల్‌నగర్ ప్రధాన రహదారి ప్లాట్ యజమానుల సమస్యలను శ్రీ బండి రమేష్ స్వయంగా పర్యటించి అడిగి తెలుసుకున్నారు. 1980లో ఏర్పడిన లేఅవుట్ ప్రకారం కేవలం 40 అడుగుల రహదారి మాత్రమే ఉండగా, ఇప్పుడు 120 అడుగుల పేరుతో ప్రభుత్వం భూసేకరణ చేయడం తీవ్ర అన్యాయమని స్థానిక యజమానులు ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మూసాపేట నుండి లింగంపల్లి వరకు ఇతర ప్రాంతాల్లో కేవలం 60-80 అడుగుల రహదారే ఉంటే, ఇక్కడ మాత్రం 120 అడుగులు అడగటం ఏంటని ప్రశ్నించారు. గత 40 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యపై స్పందించిన బండి రమేష్, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలించి త్వరలోనే అధికారులతో చర్చించి న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.










