ఆసిఫాబాద్ ఆసుపత్రిలో రోగుల పడిగాపులు: అధికారుల నిర్లక్ష్యం|

0
65

కుమురం భీం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. వైరల్ జ్వరాలు, సీజనల్ వ్యాధుల తీవ్రతతో ఆసుపత్రికి వస్తున్న బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఓపీ కౌంటర్లు, ల్యాబ్ ల వద్ద గంటల కొద్దీ వేచి ఉండటంతో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం మారలేదు. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడం, సిబ్బంది కొరతపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, యుద్ధప్రాతిపదికన మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోగుల ఇబ్బందులను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.