పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు
భారత్ అవాజ్ న్యూస్:-26 జూలై వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. హనుమకొండలోని తన నివాసంలో ఆదివారం ఉదయం 7:30 గంటలకు గుండెపోటు రావడంతో రోహిణి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు సీపీఆర్ నిర్వహిస్తున్నట్లు, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, మాజీ మంత్రి హరీశ్ రావు కార్యాలయం నుంచి వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము










