“ఏం చేస్తారో చేయండి.. మా పెద్దిని కాపాడండి” కేసీఆర్|

0
1

తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. ఐసీయూలో ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. “మీరేం చేస్తారో చేయండి.. మా పెద్దిని కాపాడండి” అంటూ వైద్యులకు చేతులెత్తి నమస్కరించారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి గుండె ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, వైద్య ఖర్చులకు వెనుకాడబోమని భరోసా ఇచ్చారు. సుదర్శన్ రెడ్డికి ప్రపంచస్థాయి చికిత్స అందిస్తున్నామని, విదేశీ వైద్యుల సలహాలు కూడా తీసుకుంటున్నామని డాక్టర్లు తెలిపారు. ఆయన మెదడు పునరుత్తేజం చెందాల్సి ఉందని, ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం చెప్పేందుకు మరో 48 గంటల సమయం పడుతుందని వివరించారు. కేసీఆర్ వెంట హరీష్ రావు సహా పలువురు ముఖ్య నేతలు ఉన్నారు.