మదనపల్లె ఎమ్మెల్యే శ్రీ మహమ్మద్ షాజహాన్ బాషాను నాయీ బ్రాహ్మణ నాయకులు శుక్రవారం కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని వారు ఎమ్మెల్యేను కోరారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కార్పొరేట్ సెలూన్ల వల్ల స్థానికుల ఉపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కులవృత్తిపై ఆధారపడిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. యువత ఆధునిక సెలూన్లు ఏర్పాటు చేసుకునేలా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, ఆధునిక పరికరాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.










