చింతూరు వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ!|

0
1

పోలవరం జిల్లా చింతూరు మండలంలోని గోదావరి వరద ముంపు గ్రామాల్లో ఈ రోజు ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. గడిచిన గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకి వరదలు పోటెత్తి చింతూరు మండలం లోని అనేక గ్రామాలు నీట మునిగి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోన్నారు. ప్రభుత్వం సాధ్యమైనమేరకు ప్రజలకు పునరావాసం కల్పించింది అయిన ప్రజలు త్రాగు నీరు, తిండికి నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కావున వరదల వలన నష్టపోయిన ఏ,జి కోడేరు, కల్లేరు గ్రామాలలోని కుటుంబాలకు ప్రభుత్వం తమవంతు నిత్యావసర సరుకులు ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది. ఆయా గ్రామస్థులు మాట్లాడుతూ వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోన్న మాకు ప్రభుత్వం నుండి కొంత సహాయం అడండపట్లా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పంపిణీ కార్యక్రమంలో చింతూరు మండల టీడీపీ అధ్యక్షుడు జమల్ ఖాన్, యంఆర్వో, విఆర్వో లు  స్వర్ణ గ్రామ సచివాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

# Yadagiri