మదనపల్లె: పాస్‌ పుస్తకాలు మంజూరు చేయాలని రైతుల వినతి|

0
0

మదనపల్లె మండలం పొన్నూటిపాళెం పరిధిలోని 22.89 ఎకరాల పిత్రార్జిత భూమికి సంబంధించి తమకు 1బీ, అడంగల్, పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని 89 మంది రైతులు సబ్ కలెక్టర్, జేసీలను కోరారు. తరతరాలుగా ఈ భూమి తమ అనుభవంలో ఉందని, ఇది ప్రభుత్వ భూమి కాదని వారు స్పష్టం చేశారు. మొత్తం 90 మంది భాగస్తుల్లో ఒకరైన ఎన్‌ఆర్‌ఐ చలపతి నాయుడు.. కోర్టు నుంచి ఎలాంటి స్టే లేకపోయినా తమకు పాస్ పుస్తకాలు రాకుండా అడ్డుకుంటున్నారని రైతులు ఆరోపించారు. వెబ్‌ల్యాండ్‌-2లో సాంకేతిక సమస్యలు ఉన్నందున, వెబ్‌ల్యాండ్‌-1 ద్వారా 1బీ, అడంగల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సబ్ కలెక్టర్ లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న ఈ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని కోరారు.